Campaign | గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం

Campaign | గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం

  • కొప్పుల ఈశ్వర్

Campaign | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గ్రామాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, రెండేళ్లలో గ్రామాలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అభివృద్ధి కోసం కొట్లాడుతారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సత్యం వెనుక బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కేసీఆర్ ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టి కూడా పోయలేదని ఎద్దేవా చేశారు.

Leave a Reply