శునకాల దాడిలో ఆవుదూడ మృతి..

శునకాల దాడిలో ఆవుదూడ మృతి..
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో శునకాలు చెలరేగిపోయాయి. గ్రామానికి చెందిన కొంగళ్ళ బీరయ్య బుధవారం రాత్రి తన పాకలో పశువులని కట్టి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం పాల కొరకై పశువుల వద్దకు వెళ్లి చూడగా వీధి కుక్కల దాడిలో ఆవుదూడా మృతి చెందినట్టు గమనించి బోరున విలపించారు. పాల వ్యాపారం పై జీవనం కొనసాగిస్తున్నాడు.
నేడు ఆవుదూడా మృతి చెందడంతో పాల దిగుబడి తగ్గినట్టు తెలిపారు. గతవారంలో ఇదే గ్రామానికి చెందిన కొంగళ్ళ అల్లాజికి సంబందించిన 2 ఆవుదూడల పై దాడి చేసి చంపడంతో గ్రామంలోని రైతులు భయాందోళనకి గురవుతున్నట్టు తెలిపారు. అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
