Calendar | క్రిస్మస్ వేడుకల్లో మాజీ సీఎం

Calendar | క్రిస్మస్ వేడుకల్లో మాజీ సీఎం

  • కుటుంబ సభ్యులతో కలిసి జ‌గ‌న్ ప్రత్యేక ప్రార్థనలు

Calendar | పులివెందుల, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని సీఎస్ఐ చర్చి(CSI Church)కి తన నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయల్దేరి సీఎస్ఐ చర్చికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం క్రిస్మస్ కేకును తన తల్లి వైయస్ విజయమ్మ, పెద్దమ్మ వైయస్ భారతి రెడ్డి, సమీప బంధువు పెదనాన్న వైయస్ ప్రకాష్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చర్చి ఫాదర్ లతో కలిసి కట్ చేశారు. అనంతరం తల్లి జ‌గ‌న్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అక్కడే 2026 నూతన క్యాలెండర్‌(calendar)ను ఆయన వారితో కలిసి ఆవిష్కరించారు.

Calendar |

జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చర్చి వద్దకు ప్రజలు పెద్ద సంఖ్య‌లో తరలివచ్చారు. చర్చి నుండి బయటికి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎగబడ్డారు. జై జగన్(Jai Jagan) అంటూ నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులు జగన్ మామయ్య అంటూ ఆయనతో సెల్ఫీ ఫోటోలు(selfie photos) దిగారు. అక్కడనుంచి తన నివాసం చేరుకొని కాన్వాయ్ ద్వారా బెంగళూరుకి తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్ రెడ్డి , పట్టణ ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ పార్లపల్లె కిషోర్, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Calendar |

Leave a Reply