Cabinet decisions |పాకిస్థాన్ తో అన్ని దౌత్య సంబంధాలు కట్ – సింధూ జలాల ఒప్పందం రద్దు

న్యూ ఢిల్లీ: జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన మారణహోమానికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

అటారీ చెకోపోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాకిస్థాన్ కు చెందిన పౌరులను భారత్‌లోకి అనుమతించేది తేల్చి చెప్పింది. .పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ కమిటీ భేటీలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ కు చెందిన పౌరులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని ఆదేశించారు. పాకిస్థాన్‌ పర్యటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాకిస్థాన్ పౌరులు భారత్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు భారత్ లో ఉన్న పాక్‌ హైకమిషనర్‌ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంతవరకు ఇది అమలవుతుంది.

దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాలి.

కేబినెట్‌ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఈ వివరాలను వెల్లడించారు.

మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

1. 1960 నాటి సింధు జలాల ఒప్పందం వెంటనే రద్దు చేయబడుతుంది

2. అటారీ – వాఘా సరిహద్దు తక్షణమే మూసివేయబడుతుంది. చెల్లుబాటు అయ్యే ఎండార్స్‌మెంట్‌లతో సరిహద్దు దాటినవారు 2025 మే 1లోపు ఆ మార్గం గుండా తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

3. సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తాన్ జాతీయులు భారతదేశానికి రావడానికి అనుమతించబడరు. పాకిస్థానీ పౌరులకు గతంలో జారీ చేసినటువంటి SVES వీసాలు రద్దు చేయబడినట్లు పరిగణించబడతాయి. SVES వీసా కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా భారతదేశంను 48 గంటలలోపు వీడి వెళ్లాల్సి ఉంటుంది.

4. న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నౌకాదళం, వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రేటాగా ప్రకటించారు. వారు భారతదేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి భారతదేశం తన రక్షణ, నౌకాదళం, వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంటుంది. సంబంధిత హైకమిషన్లలోని ఈ పోస్టులు రద్దు చేయబడినట్లు పరిగణించబడతాయి.

5. రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *