C/O Rayachotiy :  మోస్ట్ వాంటెడ్  

Andhra Prabha Crime Story

C/O Rayachotiy :  మోస్ట్ వాంటెడ్  

Andhra Prabha Crime Story

కేర్​ ఆఫ్​  రాయచోటి

– ముగ్గురూ ముగ్గురే

– పదేళ్లుగా అజ్ఙాతం

 మంగళూరుకు చెందిన నసీర్ అరెస్ట్ –

 సంయుక్త ఆపరేషన్ విజయవంతం

నకిలీ పేర్లతో రాయచోటిలో జీవనం

26 కేసులు – జీవిత ఖైదు శిక్షలు కూడా!

రాజకీయ అండదండల ఆరోపణలు

చిన్నతనం నుంచే నేర చరిత్ర

మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు

కొత్తపల్లిలో పెళ్లిళ్లు 

ఈ సంబంధాల అనుమానం

అన్నమయ్య ఎస్పీకి కర్ణాటక డిజిపి ప్రశంసలు

( అన్నమయ్య బ్యూరో , ఆంధ్రప్రభ)

 C/O Rayachotiy  :   అన్నమయ్య పాత జిల్లా కేంద్రం రాయచోటి కరుడుగట్టిన నేరస్తులకు అంతర్జాతీయ ఉగ్రవాదులకు కేరాఫ్ గా నిలుస్తోంది. బయట రాష్ట్రాల నుంచి కరుడుగట్టిన నేరస్తులు ఉగ్రవాదం మరకలు అంటిన వారు తలదాచుకోవడానికి రాయచోటినే ఎంచుకుంటున్నారు.

C/O Rayachotiy

అంటే నేరం చేయడం ఎంత తప్పు నేరాన్ని  ప్రోత్సహించడం అంతకన్నా తప్పు. ఏడాది క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాల కాలంగా రాయచోటి ప్రజలు పోలీసుల కళ్ళుగప్పి రాయచోటి ముస్లిం సోదరుల్లో కలిసిపోయి అనుమానం రాకుండా జీవించడాన్ని పోలీసు వర్గాలు నెగ్గుతేల్చాయి.

వారికి రాయచోటిలో ఆశ్రయమిచ్చిన వారిని వారికి వివాహాలు కావడానికి అమ్మాయిలను సమకూర్చిన వారికి వారి జీవన విధానంలో తొంగిచూసిన వారికి వారెంత మోస్ట్ వాంటెడో తెలియకుండా ఉంటుందా? తెలిసినా సరే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా వారి అచూకీ బయటికి పొంగనీకుండా కాపాడిన వారు అంతర్జాతీయ ఉగ్రవాదుల కంటే పెద్ద నేరస్తులే. ఇది మొన్నటి కథ.       

C/O Rayachotiy

తాజాగా రాయచోటిలో ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అచూకీలభ్యమైనది. వారిలో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా మరొకరు సౌదీ అరేబియాలో ఇంకొకరు బెంగళూరులోనూ ఉన్నట్టు తెలుస్తోంది.

   C/O Rayachotiy:    కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన నసీర్ ను మంగళవారం కర్ణాటక రాయచోటి పోలీసులు సంయుక్తంగా రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులకు చిక్కిన నసీర్ అసలు పేరు సఫాన్ హుస్సేన్ హమబి. రాయచోట్లో మాత్రం షేక్ యూసఫ్ గా చలామణి అవుతున్నట్టు పోలీసు విచారణలో బట్టబయలైంది. పాస్పోర్టులో అతని పేరు ఈమర్  మహమ్మద్ షాసిర్గా ఉన్నట్టు సమాచారం.

C/O Rayachotiy

ఇతనిపై కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 26 కేసులున్నాయి. వాటిలో 13 కేసులు విచారణలో ఉన్నాయి. రెండు కేసుల్లో జీవిత ఖైదు పడినట్టు సమాచారం. మరో నాలుగు హత్య కేసులు విచారణలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో నమోదైన ఈ నేరాలను తప్పించుకోవడానికి నసీర్ మంగళూరు నుంచి రాయచోటికి వచ్చినట్టు సమాచారం.

 C/O Rayachotiy :  రాయచోటిలో ఓ నేత అండదండలు

 కర్ణాటక రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరుగాంచిన నసీర్ రాయచోటిలో నివసించడానికి గతంలో ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముస్లిం మైనారిటీ నాయకుడు అండదండలు అందించినట్లు విమర్శలు ఉన్నాయి. అక్కడ నుంచి ఆధార్ కార్డు తయారీ, పాస్పోర్ట్ తయారీ, పోలీసుల కళ్ళు కప్పి  తప్పించుకునే ట్రిక్కులు వంటి అంశాలలో ఆ నేత నసీర్ కు సహకరిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి రుజువైతే వీలైనంత త్వరలో అతన్ని అరెస్టు చేసి కర్ణాటక తరలించే అవకాశాలు ఉన్నాయని  చెబుతున్నారు. ఇక ఆ నేరస్తుడికి రాయచోటి పట్టణంలో వివాహం చేస్తే స్థానిక బలం పెరుగుతుందని భావించి కొత్తపల్లిలోని ఓ యువతిని మాట్లాడి వివాహం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో నసీర్ రాయచోటి వాసిగా అందరికీ పరిచయం అవుతూ వస్తున్నాడు. మొత్తంగా నసీర్ అరెస్టుతో అతనికి ఆశ్రయమిచ్చిన వారు వివాహం చేసి సహకరించిన వారు  కటకటాలపాలుగాక తప్పదని పలువురు అంటున్నారు.

C/O Rayachotiy:   చిన్నతనం నుంచే నేర చరిత్ర

 రాయచోటిలో పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నతనం నుంచే నేర చరిత్రను సంపాదించినట్టు పోలీసు విచారణలో తేలుతోంది. హత్యలు, అత్యాచారాలు వంటివి అతనికి చాలా చిన్న పనుల్లా కనిపిస్తున్నట్టు పోలీసు వర్గాలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తనపై 26 కేసులు ఉండగా అందులో సుమారు పది కేసులు పోలీసులను చంపడానికి ప్రయత్నించిన కేసులేనని సమాచారం.

C/O Rayachotiy : మరో ఇద్దరి కోసం పోలీసులు జల్లెడ

 నసీర్ సోదరులుగా చలామణి అవుతూ ఎన్నో నేరాల్లో నిందితులుగా ఉన్న షేక్ మహమ్మద్ సాదిక్ అలియాస్ సంసుద్దీన్ షేక్ ఇర్ఫాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు సౌదీ అరేబియాలోను,  ఇంకొకరు బెంగళూరులోనూ ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురూ మంగళూరుకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

C/O Rayachotiy

వారు ముగ్గురు అన్నదమ్ములుగా రాయిచోట్లో చలామణి అవుతూ చికెన్ పకోడీ వ్యాపారాలు, తోపుడుబండ్లపై ఎర్రగడ్డలు టమోటాల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటూ గల్ఫ్ దేశాలకు తరచుగా వెళ్లి వచ్చే వారని స్థానికులు చెబుతున్నారు. వీరు ముగ్గురు రాయచోటి లోని కొత్తపల్లి లో వివాహాలు చేసుకున్నారు. ఈ ముగ్గురిలో నసీర్ రాయచోటి పట్టణం కొత్తపల్లికి చెందిన ఇస్మాయిల్, సిరాజ్ ఉన్నిసా కుమార్తె రేష్మ సుల్తానాను వివాహం చేసుకున్నాడు.

C/O Rayachotiy

2021లో నసీర్ కు వివాహం జరగ్గా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. తక్కిన ఇద్దరిలో షేక్ మహమ్మద్ సాదిక్ షేక్ ఇర్ఫాన్ కూడా రాయచోటిలోననే వివాహం చేసుకున్నారు. వీరిలో పోలీసుల అదుపులో ఉన్న నసీర్ కు రాయచోటి పట్టణంలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

 C/O Rayachotiy :  అన్నమయ్య ఎస్పీకి కర్ణాటక డిజిపి ప్రశంసలు  

C/O Rayachotiy

కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోవడంలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి చూపిన చొరవకు కర్ణాటక డిజిపి ప్రశంసించినట్టు సమాచారం. పది రోజుల క్రితమే కర్ణాటక నుంచి కొంతమంది పోలీసులు రాయచోటికి వచ్చి ఎస్పీ ధీరజ్ ను  సంప్రదించినట్టు తెలుస్తోంది. తదనంతరం కర్ణాటక, రాయచోటి పోలీసులు సంయుక్తంగా రెక్కీలు నిర్వహించి పట్టుకున్నారు. మొత్తంగా చూస్తే రాయచోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే బాంబుగా మారిందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ :

Leave a Reply