HIGH COURT| కోర్టు ఆదేశాలతో..

HIGH COURT| బిక్కనూర్, ఆంధ్రప్రభ : హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సొసైటీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు మద్దిస్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పదవీకాలం ముగిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సొసైటీల పాలకవర్గాలను మరో ఆరు నెలలు పొడిగించిందని గుర్తు చేశారు. తమ సొసైటీ పాలకవర్గాన్ని పొడిగించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పాలకవర్గ పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. సొసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply