Business | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెషన్లలోనే సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోయి 76,791 కి పడిపోయింది. నిఫ్టీ 236పాయింట్లు తగ్గి 23,246కి క్షీణించింది. సూచీల క్షీణతతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్ల నుంచి రూ.419 లక్షల కోట్లకు క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లు ఆవిరైంది. ఈరోజు మార్కెట్ల నష్టాలకు ముఖ్యంగా 5 కారాణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కెనడా, మెక్సికో, చైనా పై టారిఫ్లు పెంచుతామని ఆయన చేసిన ప్రకటనతో ఆసియా మార్కెట్లు సోమవారం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ సూచీ, కోరియా కోస్పిసూచీలు 3 శాతం తగ్గాయి. చరిత్రలోనే తొలిసారి డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 87 కు క్షీణించింది. ట్రంప్ టారిఫ్లు విధిస్తానని చేస్తున్న ప్రకటనలో డాలర్ విలువ అంతకంతకూ బలపడుతోంది.

ఈ క్రమంలోనే ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతుండటంతో రూపాయి రోజురోజుకు పతనమవుతోంది. బడ్జెట్ పై ఇప్పటికే స్పష్టత వచ్చింది. పన్ను భారం తగ్గించడం రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ పై ఇన్వెస్టర్ల దృష్టంతా ఉంది. వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతాయనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 7న దీనిపై ప్రకటన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తపడుతున్నారు. వడ్డీ రేట్లపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.

ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. జనవరిలో దాదాపు రూ. 70 వేల కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆక్టోబర్ 1 నుంచి ఫిబ్రవరి 1 వరుకు చూసుంటే ఏకంగా రూ. 2.7 లక్షల కోట్లు విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. దీంతో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *