బస్ స్టాప్ ప్రారంభం..

బస్ స్టాప్ ప్రారంభం..

  • ఆర్టీసీ ఆర్ఎంకు వినతిపత్రం అందజేస్తున్న కౌన్సిలర్ శ్రీలత చిరంజీవి
  • ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను సన్మానిస్తున్న కౌన్సిలర్ శ్రీలత చిరంజీవి
  • కౌన్సిలర్ శ్రీలత చిరంజీవి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా తంగడపల్లి 6వ ప్రజల విజ్ఞప్తి మేరకు ముత్యాలమ్మ దేవాలయం వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేయిస్తానని అవార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి హామీ ఇచ్చి కౌన్సిలర్ గా గెలిచిన వెంటనే నల్గొండ రీజినల్ మేనేజర్ కు ప్రజల సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు.

వెంటనే స్పందించిన ఆర్టీసీ ఆర్ఎం తంగడపల్లి ముత్యాలమ్మ దేవాలయం వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడంతో తంగడపల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర ఏర్పాటుచేసిన రిక్వెస్ట్ బస్టాప్ ను 6వ వార్డ్ కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి మరో కౌన్సిలర్ గడ్డం ఇందిరా రాజారత్నం తో కలిసి ప్రారంభించారు. మొదటి రోజు బస్సును తీసుకువచ్చి రిక్వెస్ట్ స్టాప్ లో ఆపిన డ్రైవర్, కండక్టర్లను కౌన్సిలర్ శ్రీలత చిరంజీవి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముటుకులోజు వెంకన్నచారి, సిల్వేరు యాదేష్, బత్తుల జనార్ధన్, కర్తల శ్రీను, బలికే శ్రీను, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply