BUS | బస్టాండ్‌లో ప్రయాణికుల పాట్లు
- గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సుల రాక ఇబ్బందులు
- బస్సులను సమకూర్చడంలో డిపో అధికారులు విఫలం
BUS | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం బస్టాండ్‌లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. ఉచిత బస్సు (Bus) పథకం అమల్లోకి రావడంతో రద్దీ పెరిగింది. ఆర్టీసీ డిపో అధికారులు ప్రయానికులకనుగుణంగా బస్సులను సమకూర్చలేకపోతున్నారు. గుడివాడ బస్టాండ్‌లో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. ఆదివారం కావడంతో బస్టాండ్కు ప్రజలు అధిక సంఖ్యలో తరలిచ్చారు. బస్సులు రాకపోవడంతో గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుంది. బస్సుల గురించి అడిగేందుకు ఆర్టీసీ డిపో అధికారులు అందుబాటులో లేరని ప్రయాణికులు తెలిపారు.

