(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఉత్తర దక్షిణ భారత దేశాల కూడలి బెజవాడ రైల్వే స్టేషన్ (Bezawada Railway Station)కు బుల్లెట్ రైలు (Bullet Train) వస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు (NDA government) దక్షిణ భారత దేశంపై ఫోకస్ పెట్టింది.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజల మదిని కొల్లగొట్టే రీతిలో వరాల మీద వరాలు కుమ్మరిస్తోంది. తాజాగా ఏపీలో నూతన రాజాధానికి బుల్లెట్ రైలును సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ముంబై, అహ్మదబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ (Hyderabad), చెన్నై, అమరావతి , బెంగళూరు నగరాల్లో ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ప్రపంచంలోనే ఈ నాలుగు నగరాలు అతిపెద్ద మార్కెట్. అందుకే బుల్లెట్ ట్రెయిన్ ను రంగంలోకి దించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. అతి త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుంది. ఎనీ హౌ.. రాబోయే బెజవాడ తరాలనికి బుల్లెట్ రైలు రెడీ అవుతోందోచ్…