Budget 2025 | ఉద్యోగులకు వరం… రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
ఢిల్లీ: వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూ.12లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నును మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నాగా ఉంటుందని తెలిపారు. డిడక్షన్ లలో జీవిత బీమా, మెడికల్ , విద్యా , గృహ రుణాలకు ఏడాదిలో ఎనిమిది లక్షల వరకు చేసుకోవచ్చు.. ఇవన్ని కలుపుకుంటే 12 లక్షల వరకు పన్న మినహాయింపు లభిస్తుంది..
కొత్త ఆదాయ పన్ను శ్లాబ్ లు
రేూ. 0-4 లక్షల వరకు పన్ను లేదు
రూ. 4-8 లక్షల వరకు 5శాతం పన్ను
రూ. 8-12 లక్షల వరకు 10% పన్ను
రూ. 12-16 లక్షల వరకు 15% పన్ను
రూ. 16-20 లక్షల నుంచి 20 శాతం పన్ను
రూ. 20-24 లక్షల వరకు 25% శాతం
రూ. 24 లక్షల ఆదాయం దాటితే 30% శాతం పన్ను