ప్ర‌పంచ శాంతిని కోరుతూ బిక్కుల యాత్ర‌

ప్ర‌పంచ శాంతిని కోరుతూ బిక్కుల యాత్ర‌

  • సంగారెడ్డికి చేర‌కున్న దమ్మయాత్ర
  • థాయిలాండ్ బంతేజీలకు స్వాగ‌తం ప‌లికిన బౌద్ధులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్ర‌పంచ శాంతిని కోరుతూ థాయిలాండ్ నుంచి వ‌చ్చిన బిక్కులు ద‌మ్మ‌యాత్ర‌ను కొసాగిస్తున్నారు. ఈ యాత్ర ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని గోకుల్ ఫంక్ష‌న్ నుంచి బయలుదేరి ఇస్నాపూర్ వరకు కొనసాగనుంది. ఈ యాత్ర గగన్ మాలిక్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ గ‌గ‌న్ మాలిక్ సార‌థ్యంలో మ‌ధ్యప్ర‌దేశ్ విహార నిర్వాహ‌కుడు డాక్ట‌ర్ మోహ‌న్‌రావు, ఎల్‌.జ‌నార్ద‌న్‌తోపాటు 60 మంది బంతేజీలతో కొన‌సాగుతున్న‌ది. యాత్ర బృందానికి టీజీవో సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ వైద్య‌నాథ్‌, మాల ఉద్యోగుల అధ్య‌క్షుడు బ‌క్క‌న్న‌, మాల ఉద్యోగుల ముఖ్య స‌ల‌హాదారుడు బి.నాగ‌య్య, డాక్ట‌ర్ బి.జ‌నార్ద‌న్‌, అందోల్ మ‌ల్లేశం, మోహ‌న్‌రాజు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ దౌల‌య్య‌, త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికారు.

సాయంత్రం 7 గంట‌ల బుద్ధ వంద‌నం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. గగన్ మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో దమ్మయాత్ర ఫిబ్రవరి 1న గుల్బర్గా బుద్ధవిహార్ నుంచి ప్రారంభమైందని నిర్వాహ‌కులు ఎల్‌.జ‌నార్ద‌న్ తెలిపారు. మార్చి 1న నాగార్జున సాగర్‌లోని బుద్ధవనానికి చేరుకోనుంది. అనంతరం మార్చి 3న దమ్మయాత్రలో పాల్గొన్న బంతేజీలతో పాటు దేశవ్యాప్తంగా బౌద్ధులు భారీ సంఖ్యలో హాజరుకానున్న‌ట్టు తెలిపారు. యాత్ర కోఆర్డినేటర్లు కేకే రాజా మాట్లాడుతూ దమ్మయాత్రకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.

యాత్ర‌లో భాగంగా థాయిలాండ్ నుంచి బుద్ధుడి అస్తిక‌ల‌ను తీసుకొచ్చారు. కాగా ప‌లువురు బుద్ధిస్టులు బుద్ధ‌భ‌గ‌వానుడి అస్తిక‌ల‌ను ద‌ర్శించుకొని ప్రార్థ‌న‌లు చేశారు. బుద్ధుడి బోధ‌న‌లు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, బౌద్ధ ధర్మ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే దమ్మయాత్ర ప్రధాన లక్ష్యమని గగన్ మాలిక్ ఫౌండేషన్ చైర్మన్ గగన్ మాలిక్ పేర్కొన్నారు. కాగా సంగారెడ్డికి చెందిన గోకుల్ ద‌వాఖాన యాజ‌మాన్యం డాక్ట‌ర్ శ్రీ‌హ‌రి సౌజ‌న్యంతో ద‌మ్మ‌యాత్ర‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డంతో పాటు బంతేజీల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌డంపై ప‌లువురు బుద్ధిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఆయ‌నకు బుద్ధ‌వంద‌నాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బ‌ల‌రాం కాంబ్లే, మాల ఉద్యోగుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.రాజు, మాల ఉద్యోగ‌ల సంఘం కోశాధికారి బి.మొగుల‌య్య‌, మాల ఉద్యోగుల సంఘం గౌర‌వ అధ్య‌క్షుడు ఎం.విజ‌యరావు, మాదేవిని అనంత‌య్య‌, సంగారెడ్డి అంబేడ్క‌ర్ స్ట‌డీ స‌ర్కిల్ రామారావు, బి.ద‌ర్శ‌న్‌, దుర్గాప్ర‌సాద్‌, బీజేపీ కౌన్సిల‌ర్ కొండాపురం జ‌గ‌న్, గంగారం కె.ర‌వింద‌ర్‌, ఆలిండియా స‌మ‌తా సైనిక్ ద‌ళ్ బీద‌ర్ శాఖ నాయ‌కుడు సంతోష్ ఫూలే నుంచి 100 మంది పాల్గొన్నారు.

Leave a Reply