brutal incident | వెలుగులోకి సంచలనాలు

brutal incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మధురలోని మహాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఒకేసారి మరణించడం హృదయవిదారకంగా మారింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతిని కలిగించింది. ఒకే కుటుంబంలో ఐదుగురు ఒకేసారి చనిపోవడం పట్ల స్థానికులు, ప్రజలు షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. మృతుడు మనీష్ (35) ఈ ఘటనకు ముందు వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదు, ఎవరినీ నిందించొద్దు అంటూ ఆ వీడియోలో తెలిపాడని పేర్కొన్నారు. ముందుగా పిల్లలకు విషమిచ్చి, భార్యను రోకలిబండతో కొట్టి చంపాడని, అనంతరం అతడు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
