KTR | రైతులెవరూ అధైర్య పడకండి
పత్తి రైతులతో కేటీఆర్
KTR | నేరడిగొండ (ఆదిలాబాద్ జిల్లా), ఆంధ్రప్రభ : రైతులు ఎవరూ అధైర్య పడొద్దని బీఆర్ఆస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ( కేటీఆర్) (KTR) అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన పత్తి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి జిన్నింగ్ మిల్లులో సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
రైతులతో మాట్లాడుతూ రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ కూడా ఉంటుందన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు (farmers) ఎటువంటి కష్టం లేకుండా చూశామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజ కొన్నామని తెలిపారు. అంతకు ముందు రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు.

