BRS senior leaders | జుక్కల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బొల్లి గంగాధర్

BRS senior leaders | జుక్కల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బొల్లి గంగాధర్
BRS senior leaders | జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడుగా జుక్కల్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి గంగాధర్ నియామకమయ్యారు. బీఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఇవాళ జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు.
ఈసందర్భంగా బొల్లి గంగాధర్ ను బీఆర్ఎస్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తమపై నమ్మకంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షునిగా నియమించినందుకు తాను గ్రామస్థాయి నుండి బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలోపేతానికి కృషి చేయటమే కాకుండా ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందేవిధంగా పోరాటం చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు, జుక్కల్ మండల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంతో తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
