బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం..

బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం..

  • బీసీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పందించాలి
  • బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ అమలు చేసి 50 వేల కోట్లు కేటాయించాలని.. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట అధికారంలోకి వచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య మండిపడ్డారు.

ప్రతి ఏటా బీసీల బడ్జెట్ కు రూ. 25వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక రూపాయి కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్ బూచిగా చూపి ఇలా బీసీలను పూర్తిగా మర్చిపోయారన్నారు.

బీసీల ఓట్లను ఒక బ్యాంకు గా చూడడమే తప్ప వారి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పాటుపడటం లేదన్నారు. బీసీల కార్డుతో ఎమ్మెల్యేగా గెలిచిన బిర్ల ఐలయ్య ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడం లేదు. బీసీ అని చెప్పుకునే ఎమ్మెల్యే అయిలయ్య ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని బీసీల వద్దకు వెళ్తారో చెప్పాలన్నారు. ఈ బడ్జెట్ లో సామాజిక న్యాయం జరుగలేదని అన్నారు. గౌడ్స్ , గొల్ల కురుమలు, పద్మశాలి, రజక, కుమ్మరి, కమ్మరి కులస్తులతో పాటు బీసీ ల్లో ఏ కులస్తులకు న్యాయం జరుగలేదని ఆవేదన చెందారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే 100 రోజుల్లో బీసీ సంక్షేమానికి యేటా 25వేల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఇచ్చిన ఆమెని మర్చిపోయి బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్ ఊసెత్తడం లేదన్నారు. ప్రతి ఏటా బిసి సంక్షేమానికి 25000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలో కేవలం ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

బీసీ కార్డుతో ఎమ్మెల్యే అయిన అసెంబ్లీలో బీసీల అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ నేను బీసీ బిడ్డను అని చెప్పుకోను అయిలయ్య ఆ బీసీల అభివృద్ధిపై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రెడ్డి అగ్ర కులస్తుల వద్ద బీసీ కులాన్ని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అమ్మకాని పెట్టారని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో బీసీల నుంచి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, మండల సెక్రెటరీ జనరల్ కసావు శ్రీనివాస్ గౌడ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సతీష్ యాదవ్, నాయకులు బాలయ్య గౌడ్, కంసాని స్వామి, శారాజీ రాజేష్ యాదవ్, విజయ్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply