mallareddy| డ్యాన్స్‌తో అదరగొట్టిన మల్లన్న

mallareddy| డ్యాన్స్‌తో అదరగొట్టిన మల్లన్న
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలోనైనా.. ఆటలోనైనా… తనకు సాటెవరూ లేరని నిరూపిస్తుంటారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా ఉంటారు. పలు వేడుకల్లో, పార్టీకి సంబంధించిన ర్యాలీల్లో స్టెప్పులేస్తూ అందరిలో ఊపు తెస్తుంటారు. తాజాగా ఆయన 50వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేడుక మధ్యలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం దురంధర్ పాటకు మల్లారెడ్డి అద్భుతంగా నృత్యం చేశారు. మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆయన సతీమణి కల్పనమ్మ కూడా చిరునవ్వుతో ఆయనను ఉత్సాహపరిచారు.
డ్యాన్స్ వీడియో కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి..
https://www.instagram.com/reel/DV4JgIdE8wZ/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
