Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడగడానికి వెళుతున్నావు..?

Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడగడానికి వెళుతున్నావు..?

రేవూరి ప్రకాష్ రెడ్డి చిన్న పిల్లోడివా.. ముసలోడివా..
పరకాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం
ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రసంగం

Brs l పరకాల, ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడగడానికి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ప్రజల వద్దకు వెళ్తున్నావని బిఆర్ఎస్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైనారు. గతంలో ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆదాపాతాలలోనికి తొక్కేశావ్, నర్సంపేట నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో నీకు తెలియదు, ఏం అభివృద్ధి చేశావో అక్కడి ప్రజలు చెబుతారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇప్పుడు పరకాల అభివృద్ధి చేస్తానని, ఎంతో చరిత్ర గల పరకాలను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నావని విమర్శించారు.

మెగా టెక్స్టైల్ పార్క్, పరకాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, కూరగాయల మార్కెట్, వంద పడకల ఆసుపత్రి, ఆయుష్ ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, బస్తీ దావకానల నూతన భవన నిర్మాణాలకు మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిధులు తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. పట్టణంలోని సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ సెంటర్ ప్రధాన రోడ్డు కల్వర్టు, హౌసింగ్ బోర్డు నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు నూతన బైపాస్ రోడ్డు, పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో జరిగినవే అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ నూతన భవనాలకు రంగులు వేసి, శిలాఫలకాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్న చందంగా రేవూరి ప్రకాష్ రెడ్డి నితీరు సిగ్గుచేటని విమర్శించారు. అమాయకులైన తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీ ల పేరుతో రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి మోసం చేసి గద్దెనెక్కారని, అదే తెలంగాణ ప్రజలు మేల్కొని ఈ మున్సిపల్ ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మీ భరతం పట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డుల్లోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply