Brs l ప్రచారంలో దూసుకుపోతున్న మిరియాల అలివేలు..

Brs l ప్రచారంలో దూసుకుపోతున్న మిరియాల అలివేలు..

Brs l పాల్వంచ ఆంధ్రప్రభ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచ 47వ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిరియాల అలివేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 47వ డివిజన్లో కారు జోరు ప్రచారం కొనసాగుతుందని. ఆదివారం మిరియాల అలివేలు ఓటర్లను తనదైన శైలితో ఓటును అభ్యసిస్తున్నారు. ఆదరించి గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తానని తెలుపుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని తిరిగి మళ్లీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా గెలిపించుకోవాలని అలాంటి అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. డివిజన్ లో స్మశాన వాటిక నిర్మాణం , అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాలు, డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రజాసభ నిర్వహించి అభివృద్ధికి శ్రీకారం , డిజిటల్ లైబ్రరీ, తోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఓటు బాధ్యత మీదని అభివృద్ధి బాధ్యత తనది తెలిపారు. ఓటు అనే ఆయుధంతో డివిజన్ అభివృద్ధి చెందాలని అందుకుగాను ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply