BRS | నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా….

BRS | నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా….
BRS | కెరామే, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పై సీట్ విచారణ వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేరామే రి మాజీ జెడ్పీటీసీ సయ్యద్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిన కేసీఆర్ పై రాజకీయ కక్షతో సిట్ విచారణ పేరుతో వేధించటం సిగ్గుచేటునారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీ సరిగా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విచారణ పేరుతో మభ్యపెట్టడం. ఏమిటన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలలో రైతులకు రుణమాఫీ రైతుబంధు కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు ఎక్కడ పోయాయని ఆయన అన్నారు. ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని రాబోయే రోజులలోకాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దృక్పథబాయి, మాజీ ఎంపీపీ మోతీరామ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబాజీ, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుమురం అంబారావు, పేందూరు ఆనందరావు, చోలే నాగనాథ్, ఉమేష్, శారద, మడవి సేవాంతా భాయ్, పార్వత నాయక్, అగర్వాల్, సర్పంచ్ రోజా, బుచ్చయ్య, ఎస్.కె యూనస్ రాథోడ్, రూపులాల్, తదితరులు పాల్గొన్నారు.
