BRS | గెలుపొందిన‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు

BRS | గెలుపొందిన‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు

  • మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్

BRS | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : తాడ్వాయి మండలంలో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా నూతన పాలక వర్గాలను ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసన సభ్యుడు జాజాల సురేందర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 18 గ్రామాలకు 12 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా గెలుపొందిన‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అంటే తాడ్వాయి .. తాడ్వాయి అంటే బిఆర్ఎస్ అని మరొకసారి నిరూపించారని అన్నారు.

BRS

అధికార పార్టీ ఎమ్మెల్యే , పీఏలకు భయపడేది లేదు…

బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచులను, ఉపసర్పంచ్ లను కాంగ్రెస్ పార్టీలో కలవాలని ప్రలోభాలు పెడుతూ, ఫోను చేసి అడుగుతున్నారని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. మా పార్టీ కార్యకర్తలు కరుడ గట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని ఎలాంటి ప్రలోభాలకు లొంగరని ఆయన తెలిపారు. మా సర్పంచ్ లు కొట్లాడి బాధ్యతగా ఫండ్స్ తెచ్చుకుంటామని అన్నారు. మా సర్పంచ్ లు నీతి నిజాయితీగా బాధ్యతగా గ్రామాల్లో పనిచేస్తారని ఆయన అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాదు..

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎక్కువగా జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. రెండు సంవత్సరాలు ఆగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నూతన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి సొసైటీ మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముదాం నర్సింలు, మండల యూత్ అధ్యక్షుడు రమేష్ రావు, సర్పంచులు మెట్టు విజయ, మంగారెడ్డి, తాజోద్దీన్ చంద్ర రెడ్డి, మైలారం రవీందర్ రెడ్డి, నర్సింలు, బై రవి, పుష్పలత, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply