LORRY | విరిగిన లారీ పట్టి..
LORRY| కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : బొల్లారం రాజీవ్ రహదారిపై భారీ లోడుతో వెళ్తున్న లారీ పట్టి విరిగిపోవడంతో ఇవాళ ఉదయం నుంచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు (Vehicles) రోడ్డుపైనే నిలిచిపోయాయి. సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజ్‌గిరి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీని తొలగించేందుకు క్రేన్ ను రప్పించి పనులు చేపట్టడంతో ఆ తర్వాత క్రమంగా ట్రాఫిక్ (Traffic) సాఫీగా సాగింది.


