గంగాధర ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర రెండవ దశ కరీంనగర్ జిల్లాలోని ఉప్పర్ మల్యాల నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
ఈ పాదయాత్రలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వీరితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మెడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్, విజయ రమణారావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు