కోతుల దాడిలో కౌలు రైతు బలి…

కోతుల దాడిలో కౌలు రైతు బలి…
వైరా, ఆంధ్రప్రభ : కోతుల మూకుమ్మడి దాడిలో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో చోటుచేసుకుంది… వివరాల్లోకెళ్తే.. శనివారం లాలాపురం గ్రామానికి చెందిన నామా శ్రీనివాసరావు అనే కౌలు రైతు… బ్రిక్స్ ఫ్యాక్టరీస్ పక్కన వరి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు… పొట్ట దశలో ఉన్న వరి పైరును కోతుల బారి నుండి కాపాడుకునేందుకు.. తరచూ కాపలా వెళ్తుండేవాడు… బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద గుంపులు గుంపులుగా ఉన్నా కోతులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. కోతులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డాయి..
దీంతో వాటినుండి తప్పించుకోబోయి ప్రమాదవశాత్తు బ్రిక్స్ ఫ్యాక్టరీ పై నుండి కింద పడటంతో కింద ఉన్న ఇనుప సువ్వలు బలంగా తలకు శరీర భాగాలకు తగలడంతో.. గాయాలపాలయ్యారు. నామా శ్రీనివాసరావును ఖమ్మం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.. మృతునికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు…
నామా శ్రీనివాసరావు కు మంచి వ్యక్తి అనే పేరు ఉంది.. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరితో.. ఆప్యాయంగా కలుపుగోలుతో మాట్లాడతారని పలువురు పేర్కొన్నారు … ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు.. శ్రీనివాస రావు హఠాన్మరణంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు…
