వాయు నాళాల సంబంధిత ఆరోగ్యము, వాటికి సంబంధించి ప్రభావవంతమైన థిరపీ పరిష్కారాలు అందించడము పట్ల అవగాహన కలిగించాలనే దాని నిబద్ధతను కొనసాగించడానికి సిప్లా లిమిటెడ్, రోగికి సపోర్ట్ అందించే ఇనీషియేటివ్, బ్రీత్ ఫ్రీ, ఇది ప్రభావము చూపే ప్రయాణము, దీనిని దేశం అంతటా కొనసాగిస్తోంది బ్రీత్ ఫ్రీ యాత్రతో వ్యక్తులకు వారి వాయు నాళాల ఆరోగ్యముని అసెస్ చేయడానికి, అర్ధము చేసుకోవడానికి సహాయము చేయడమే ఈ యాత్ర ఉద్దేశ్యం.
ఇది బాగా విస్తరించిన అవగాహన, రోగికి నేరుగా సపోర్ట్ అందించడం ద్వారా సాధ్యపడుతుంది. దీర్ఘకాల ఊపిరి రోగాలైన ఉబ్బసము, సిఓపిడి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్) వంటి వాటి స్క్రీనింగ్ ఛానెల్సుకి యాక్సెస్ మెరుగుపరచడమే ఈ యాత్ర ఉద్దేశ్యం. ఈ బ్రీత్ ఫ్రీ యాత్ర, 335 పట్టణాలకు ప్రయాణము చేసింది 6,600+ క్యాంపులు నిర్వహించింది, భారతదేశము అంతటా 10 లక్షల రోగులకు సపోర్ట్ అందించింది.
పెరుగుతున్న సవాళ్ళ మధ్య వాయు నాళాల ఆరోగ్యము మీద ఫోకస్ పెట్టడముని డాక్టర్ టి.సుధీర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్, విశాఖపట్నం అన్నారు. “మిలియన్ల కొద్దీ జనాలు ప్రతి రోజూ పార్టిక్యులలేట్ మేటర్ (పిఎం2.5 – పిఎం 10) హానికరమైన స్థాయిలకు ఎక్స్పోజ్ అవుతారు, ఇవి వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్య పదార్ధాలు, నిర్మాణములో వచ్చే ధూళి మరియు వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడము వంటివి అవ్వచ్చు. అదనంగా, నగరాలలో గాలి క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 500 పైన వుండే వాటిల్లో, అక్కడి గాలిని పీల్చడము అనేది రోజుకి 25-30 సిగరెట్లు కాల్చడముకి సమానము.
ఈ కారకాలు ఊపిరితిత్తుల రోగాల భారము పెరగడానికి ప్రత్యక్షముగా దోహదము చేస్తాయి, అదే సమయములో ఉబ్బసము మరియు సిఓపిడి తరచూ పెరగడానికి దోహదము చేస్తాయి. రోగులను, కేర్ గివర్లను ఎంపవర్ చేయడానికి, ప్రజలకు సరైన సమాచారము అందించాలనే ఉద్దేశ్యముతో బ్రీత్ ఫ్రీ యాత్ర వంటి ఇనీషియేటివ్ మొదలయ్యింది. ఇది భారతదేశములో విద్య, ముందుగా డయాగ్నోసిస్ చేయడము, రోగికి సపోర్ట్ అందించడము వంటి వాటితో వాయు నాళాల రోగాల పెరుగుతున్న భారముని తగ్గించడానికి చూస్తోంది.”
అవగాహన, యాక్షన్ మధ్య గ్యాప్ ని బ్రిడ్జ్ చేయవలసిన అవసరముని హైలైట్ చేయడము, డాక్టర్ ఇలా అన్నారు, “ఉబ్బసము, సిఓపిడిని సమర్ధవంతముగా డయాగ్నోస్ చేయడము అనేది ముందుగా కనుగొనడము మరియు డాక్టర్లు-ప్రిస్క్రయిబ్ చేసిన ట్రీట్మెంట్లని స్ట్రిక్టుగా పాటించడము మీద ఆధారపడివుంటుంది. అయితే, స్టిగ్మా, ఇన్హలేషన్ థిరపీ వెనుక వున్న అపోహలు, రోజూ కనబడే లక్షణాల ఫ్లేర్-అప్స్ మీద దృష్టి పెట్టడము మొదలగునవి ఈ పరిస్థితులను కంట్రోల్లో వుండనివ్వవు. ఒక మల్టీఫెసెటెడ్ అప్రోచ్ అనేది అనివార్యము, ఇది అవగాహనను రోబస్ట్ సపోర్ట్ వ్యవస్థతో కలుపుతుంది, రోగులను గైడ్ చేస్తుంది — స్క్రీనింగ్ నుంచి దీర్ఘ-కాల ట్రీట్మెంట్ పాటించడము వరకూ. బ్రీత్ ఫ్రీ యాత్ర వంటి ఇనీషియేటివ్లు రోగులను ఎంపవర్ చేయడానికి కీలకము అవుతున్నాయి, ఇవ్వి రోగులకు అడ్డంకులను దాటడానికి, వారి ఊపిరితిత్తుల ఆరోగ్యము మీద కంట్రోల్ తీసుకోవడానికి మరియు వారి జీవితపు నాణ్యతను మెరుగుపరచుకోవడానికి సహాయము చేస్తున్నాయి.”