Breaking News | అహ్మాదాబాద్ లో కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అవుతుండ‌గా ఇళ్ల‌పై కూలిన విమానం
విమానంలో 242 మంది ప్ర‌యాణీకులు
రంగ‌లోకి దిగిన పైర్ సిబ్బంది
రంగంలోకి దిగిన స‌హాయ సిబ్బంది
ఇప్ప‌టికే వంద మందికి పైగా ప్ర‌యాణీకులు ర‌క్షింపు
ప్ర‌మాదంపై మంత్రి రామ్మోహ‌న్ నాయుడు
హోం మంత్రి అమిత్ షా ప్ర‌మాదం పై ఆరా

అహ్మాదాబాద్ (Ahmedabad) విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్ప‌కూలింది (Crashed) .. విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఆక‌స్మికంగా ఇళ్లపై కుప్ప కూలిపోయింది.. ఆ వెంట‌నే విమానానికి మంట‌లు (Fire) అంటుకున్నాయి. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు స‌మాచారం .. అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి మంట‌లు ఆర్పుతున్నాయి.. ఈ విమానం అహ్మాదాబాద్ నుంచి లండన్ కు (Ahmedabad – London) వెళ్లాల్సి ఉంది.

మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను ఆర్పుతున్నారు. ఇక పోలీసులు ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు విమానంలోంచి వంద మందికి పైగా ప్ర‌యాణీకుల‌ను రక్షించారు. మిగిలిన వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి.

కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్ గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టు సమాచారం. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

కాగా, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.

Leave a Reply