BREAKING | ఢిల్లీ దుర్ఘటన బాధితులకు ఎక్స్-గ్రేషియా..

ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మొదటగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతున్న మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు. దాంతో మృతుల సంఖ్య 12కి చేరింది.
అయితే, తాజాగా ఢిల్లీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో శాశ్వతంగా దివ్యాంగులుగా మారిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా సాయం ప్రకటించింది.
