AP | అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు..
రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎలివేట్ చేయడానికి అవసరమైన బ్రాండ్ అంబాసిడర్లను వివిధ దశల్లో నియమించాలని నిర్ణయించింది. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని అంతర్జాతీయ నగరంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లు పని చేయాలని ప్రభుత్వ భావిస్తున్నట్టు తెలిపారు.
ఏపీ ఆర్ధికవృద్ధిలో అమరావతి ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీగా అమరావతి దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని పేర్కొంది. అమరావతి బ్రాండ్ అంబాసిడర్లను నామినేషన్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నామినేషన్లను సీఎం కార్యాలయం ఎంపిక చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
బ్రాండ్ అంబాసిడర్లు.. గొప్ప కమిట్‌మెంట్తో పాటు రాజధాని ప్రాంతంలో స్థానికులతో కలిసి పని చేయాలని చెప్పారు. అయితే అమరావతికి అంబాసిడర్‌గా ఎంపికైన వారికి ఏడాది పాటు టర్మ్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. ఏపీసీఆర్డీఏ, అమరావతిల ఇమేజ్‌ను పెంచేలా బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు.