శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం…

శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం…
27న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఏర్పాట్లు పూర్తి…
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని బెల్లాల్ జిపి పరిధిలో గల నర్సింగాపూర్ గ్రామంలో గల శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానం ఈనెల 26 నుండి 28 వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు ప్రకటనలో తెలిపారు. గురువారం స్వామి వారి నిత్య పూజ పుట్ట బంగారం వైదిక హోమం శ్రీరామ యాగం పి అంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీరామచంద్రస్వామి వారి ఎదుర్కొల్లు నిర్వహించారు.
ఈనెల 27న శ్రీవారికి పంచామృతబిషేకం విశేషాలంకరణ అమ్మవారి మంగళ సూత్రాలు తలంబ్రాలు ఎదుర్కోవడం శ్రీ సీతారామచంద్ర స్వామి మహా కళ్యాణోత్సవం మహా అన్న ప్రసాదం హోమం రథ బలి 28న స్వామివారి నిత్య పూజ హోమం బ్రహ్మ కలశ ఉద్వాసన శ్రీవారి నాగవెల్లి శ్రీవారి ఏకాంత సేవ కార్యక్రమాలు ఆలయ కమిటీ గ్రామ గ్రామ కమిటీ గ్రామస్తులు పాండవ పూర్ గ్రామానికి చెందిన కార్యక్రమం వైదిక నిర్వహణ బ్రహ్మశ్రీ నేరెళ్ల నరసింహమూర్తి కౌండి న్యాస బ్రహ్మ శ్రీ నేరెళ్ల సందీపా చార్య కౌండిన్యాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
పై మహత్తర కార్యక్రమంలో పాల్గొని భక్త బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
