BOOKS | సత్యమేవ జయతే ఫౌండేషన్ ఆధ్వర్యంలో
BOOKS | తిర్యాణి, ఆంధ్రప్రభ : సత్యమేవ జయతే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు నోట్ బుక్స్, పలకలు, పెద్ద బాలశిక్ష డిక్షనరీలను ఇవాళ కొమురం భీం జిల్లా ఇన్చార్జి శివప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫౌండేషన్ గ్రామాల్లో పాత ఆలయాలను శుభ్రం చేయడం, కొత్త ఆలయాలకు విగ్రహాలు సమర్పించడం, ప్రతి ఆలయంలో మహా హారతి భజనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
BOOKS ప్రతిభ ప్రదర్శనలకు అవకాశాలు

అదేవిధంగా విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు, దేశభక్తి, దైవపర అవగాహన, క్విజ్ పోటీల ద్వారా ప్రతిభ ప్రదర్శనలకు అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి ఆసం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
click here to read తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని

