పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును….

పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును….

బిజెపి నాయకులు బాజీరావు పటేల్

ముధోల్, ఆంధ్రప్రభ : పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగునని బిజెపి నాయకులు బాజీరావు పటేల్ పేర్కొన్నారు. ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవులు మరియు పోస్టల్ డిపార్ట్మెంట్కు చెందిన రెడ్ల బాలాజీ రాసిన భువన విజయం అనే పుస్తకాన్ని బిజెపి నాయకులు బాజీరావు పటేల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాజీరావు మాట్లాడుతూ ఈ పుస్తకంలో అనేక విలువలతో కూడి ఉన్నదని చాలా అద్భుతమైన విషయాలను పొందపరచారని అన్నారు.

ఎన్నో అవార్డులు అందుకున్న రెడ్ల బాలాజీ పోస్టల్ డిపార్ట్మెంట్ కి చెందినప్పటికీ కూడా భాషపై మక్కువతో నాలుగు పుస్తకాలు రాశాడని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్ సార్ మాట్లాడుతూ దాదాపు ఈ పుస్తకంలో 20 అంశాలను పొందపరచారని దేశభక్తి రైతులు సైనికులు తల్లిదండ్రులు మొదలగు విషయాల గురించి వివరించారని చాలా అద్భుతమైన పుస్తకం అని ఇది మార్గదర్శనం చేయగల పుస్తకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి రెడ్ల బాలాజీ మిత్రులు వినాయక రావు, పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply