Bonus | బోనస్ పంపిణీ..

Bonus | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటశాల పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘంనకు 1.8.2025 నుండి 30.11.2025 వరకు పాలు పోసిన పాల ఉత్పత్తి దారుల(Milk producers)కు 1 రూ కి 0.10 పై చొప్పున 152 మందికి రూ 2,52,680. లను సంఘ అధ్యక్షులు గొర్రెపాటి సురేష్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారులు, సంఘం సిబ్బంది(Community staff) పాల్గొన్నారు. చల్లపల్లి B..M.C పరిధిలో అత్యధిక పాల సేకరణ చేసిన సంఘంగా ఘంటశాలను నిలిపినందుకు పాల ఉత్పత్తి దారులకు గొర్రెపాటి సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply