Bonalu | మహంకాళి అమ్మవారి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ – బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని వేడుకున్నానని అన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చా ) లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని నేడు ఆయ‌న దర్శించుకున్నారు. అమ్మవారికి మల్లుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లు భట్టి విక్రమార్కని ఘనంగా సత్కరించారు

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, దాదాపు రూ.1290 కోట్లతో దేవాదాయ శాఖకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. రూ.20 కోట్ల నిధులు హైదరాబాద్‌లో బోనాల కోసం విడుదల చేశామని ప్రకటించారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Leave a Reply