వరంగల్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, లాయర్లు, కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక గురువారం నాగర్ కర్నూల్, మేడ్చిల్ కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించి అవి ఫేక్ మేసెజ్‌లని తేల్చారు. శుక్రవారం ఉదయం వరంగల్ జిల్లా కోర్టు పేల్చివేస్తామని ఈమెయిల్ మెసెజ్‌లు అందాయి. దీంతో బాంబు విచ్ఛన్న స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులోని ప్రతి గదిని తనిఖీలు చేశారు. అలాగే కోర్టు ఆవరణలో కూడా తనిఖీలు చేశారు. అయితే ఫేక్ మెసెజ్ అని తేల్చారు.
నాగర్ కర్నూల్, మేడ్చిల్ కలెక్టరేట్లకు నిన్న బెదిరింపు మెయిల్స్
నాగర్ కర్నూల్, మేడ్చిల్ కలెక్టరేట్లను గురువారం మధ్యాహ్నం మూడు గంటల లోపల పేల్చివేస్తామని ఈమెయిల్ మెసెజ్ అందింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫేక్ మెసెజ్‌లు అని తేల్చారు.
మాజీ మావోయిస్టు మెయిల్ నుంచి బెదిరింపులు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మావోయిస్టు నేత నుంచి బాంబు బెదిరింపు మెసెజ్‌లు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన మాజీ మావోయిస్టు లక్ష్మణరావు పేరుతో ఉన్న మెయిల్ నుంచి మెసెజ్‌లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.