Nagpur | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

నాగ‌పూర్ : కొచ్చి నుంచి ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి (Indigo flight) బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. కాల్ వచ్చిన సమయానికి విమానం కొచ్చి నుంచి బయలుదేరింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది హుటాహుటిన ఫ్లైట్‌ను దగ్గరలో ఉన్న నాగ్‌పూర్ (Nagpur) ఎయిర్‌పోర్టు లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency landing) చేశారు. ఫ్లైట్ నుంచి ప్రయాణికులందరినీ దించేసి భద్రతా సిబ్బంది క్షుణంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎటువంటి బాంబులు లేక‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply