ఉట్నూర్ లో ఘనంగా బోగ్ బండార్ పూజలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; శ్రీరామనవమి సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజనులు , శ్రీ జగదాంబ దేవి, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ (గుడి) మందిరాల యందు భోగ్ బండారు పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని పాత ఉట్నూర్ ఎన్ ఆర్ నగర్ లో గ్రామ నాయకులు భోగి బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖంగా ఉండాలని మొక్కుతూ , హరిదాస్ చేస్తారు.

అందులో భాగంగా ఈరోజు పౌరా దేవి మరియు దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజన (గ్రామాలలో) తండాలలో భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో అదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, బంజారా నాయకులు హరిదాస్ జాదవ్ గణేష్ మహారాజ్ ,పవర్ దేవిదాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ రామ్ కిషన్ నాయక్ ,లంబాడి జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి భానోత్ జగన్ నాయక్, భానోత్ ఆనంద్ రావు, పవర్ గోవింద్ ,ప్రజాసంఘాల నాయకులు బి .రామారావు, ధారావత్ శ్యామ్ రావు, రాథోడ్ బాపురావు, చవాన్ దేవు, లాల్ సింగ్, నాందేవ్, బానోత్ దేవు రావ్ ,ఆడే విజయ్, రేనా బాయ్, చంద్రకళబాయి, రేణుక బాయి, ఎన్ జెల్ సింగ్, ఎన్ రవి, గంగారం, బంజారా లు పాల్గొన్నారు.

Leave a Reply