Bodhan | జాతీయ విపత్తుల పై అవగాహన

Bodhan | జాతీయ విపత్తుల పై అవగాహన

  • వరద విపత్తులలో సహాయక బృందం.
  • ప్రమాద సమయాలలో ఎన్ సి సి సహకారం

Bodhan | బోధన్, ఆంధ్ర ప్రభ : జాతీయ విపత్తులపై తీసుకోవలిసిన జాగ్రత్తల పై బోధన్ మండలం హంగర్గ గ్రామంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పర్యవేక్షించారు. రాష్ట్ర హోం శాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 16 కి అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వరద విపత్తులు కర్మాగారాల ప్రమాదాలు సమయాలలో అగ్నిమాపక సిబ్బంది సహకారం తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ల్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన వ్యక్తులకు సత్వర వైద్య సహాయం కోసం ఏర్పాటు చేయడం. విపత్తులలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావడం వంటి అంశాల పై ప్రయోగాత్మకంగా చూపించారు. విపత్తుల సమయంలో ఎన్ఎస్ఎస్ పాత్ర వారి సహాయ సహకారాలు వినియోగించే కొనే విధానంపై వివరించారు. కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్ ట్రాన్స్ కో డిఇ ముక్తార్ వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Bodhan
Bodhan

Leave a Reply