Bodhan | ఎన్నికల అధికారులకు శిక్షణ

Bodhan | ఎన్నికల అధికారులకు శిక్షణ

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండ‌డంతో బోధన్ (Bodhan) డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు (Nagaraju) శిక్షణ ఇచ్చారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అదనపు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అవసరమైన సామాగ్రిని అందజేశారు.

బోధన్ డివిజన్ లోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో (Mandal Parishad offices) గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని ఎన్నికల అధికారులకు అప్పజెప్పినట్లు డీఎల్పిఓ తెలిపారు. సమావేశంలో బోధన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిషోర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply