Bodhan | బెల్లాల్ లో ముగ్గుల పోటీలు

Bodhan | బెల్లాల్ లో ముగ్గుల పోటీలు

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ఇవాళ‌ ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను గ్రామంలో ఏర్పాటు చేశారు. గ్రామంలోని యువతులు, మహిళలు ముగ్గుల పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ రంగు రంగులతో ముగ్గులు వేశారు. అనంతరం బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ అన్నపూర్ణ నీలకంఠం గౌడ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply