నో ప్రోబ్లం.. నేనున్నా..

నో ప్రోబ్లం.. నేనున్నా..
—–
కొన్ని అర్జీలు ఇలా..
—–
పోడూరు మండలం పండితవల్లూరు గ్రామానికి చెందిన ఇందుర్తి దుర్గ భవాని తన భర్త చిన్న వయసులో యాక్సిడెంట్లో చనిపోయారని, తనకు 7, 9 సంవత్సరముల ఇద్దరు పిల్లలు తో కూలి పని చేసుకుంటూ జీవించుచున్నాని తెలిపారు. తన భర్త చనిపోయిన తరువాత ప్రభుత్వం నుండి ఎటువంటి బీమా సహకారం అందలేదన్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్నాను దయచేసి ఉద్యోగము గాని , ప్రభుత్వ ఆర్థిక సహాయం గాని అందించాలని ఫిర్యాదులో కోరారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురానికి చెందిన చెరకణం పార్వతి తనకు ఐదు నెలలుగా ప్రభుత్వ రేషన్ బియ్యం రావడం లేదన్నారు. తహాసిల్దార్ కార్యాలయంకు వెళ్ళగా టైం పడుతుందని అంటున్నారు. రేషన్ బియ్యం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. భీమవరం మండలం మెంటేవారి తోట, నెల రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని , విద్యుత్, మున్సిపల్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని పాలపర్తి మార్కు రాజు కోరారు. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి నుండి వృద్ధుడును అని కూడా చూడకుండా తన కుమారుడు తనపై దౌర్జన్యం చేసి నివాసముంటున్న ఇల్లు, తన దగ్గర ఉన్న కొంత నగదును కాజేసి చిత్రహింసలు పెడుతున్నాడని మార్లపూడి చాoటియ్య ఫిర్యాదు చేశారు.
గణపవరం మండలం వెంకట్రాజపురం గ్రామంలో గుత్తుల సత్యవతి తనకు ఉన్న నాలుగు సెంట్లు భూమిని సరిహద్దులు వారు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం సర్వే చేయించి తన భూమి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
