ఆంధ్రప్రభ, విశాఖపట్నం (ఏయూ) : అపోహలు వీడి.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం (BloodDonation) చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరరావు (Nageswara Rao) పిలుపునిచ్చారు.. ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహారాణిపేట శాఖ నిర్వాహకురాలు శివలీల అక్కయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో ముందుగా ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు.. యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసేవారు ఎంతో మందికి స్ఫూర్తి దాతలుగా నిలుస్తారన్నారు. మరో అతిథి ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీఆర్ రాజు (MVR Raju) మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతిరోజు వేలాది ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే నిమిషానికి 232 మంది క్యాన్సర్ తో మృత్యువాత పడుతున్నారని వీరందరికీ రక్తం ఎంతో అవసరం అన్నారు రక్తదానం చేసే వారికి కులం, మతంతో సంబంధం లేదని ఈ సమాజంలో వారికి మించిన దాతలే ఉండరన్నారు.

సింహాచలం దేవస్థానం (Simhachalam Temple) ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ… నిరంతరం సమాజం కోసం పాటుపడే బ్రహ్మకుమారీస్ రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమ‌న్నారు.. మౌంట్ అబూ కేంద్రంగా వీరి సేవా కార్యక్రమాలు దేశంలోనే స్ఫూర్తిదాయకంగా నిలిచినట్లు చెప్పారు. బ్రహ్మకుమారీస్ (Brahma Kumaris) తో కలిసి తాము అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందన్నారు.

బ్రహ్మకుమారి శివలీల అక్కయ్య మాట్లాడుతూ… ప్రకాశమని దాది 18వ దివసం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కేజీహెచ్ వైద్యుల సహకారం తీసుకుని విద్యార్థులతో పాటు బ్రహ్మకుమారీస్ కూడా ఎంతో మంది రక్తదానం చేశారని వివరించారు. శనివారం కూడా కేజీహెచ్ (KGH) లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు శివలీల చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ వైద్యురాలు దేదీప్య ..బ్రహ్మకుమారిస్ ప్రతినిధి బీకే రామేశ్వరి, ఇతర అతిధులు పాల్గొన్నారు.

Leave a Reply