blood donation | రక్తదానం చేయడానికి ముందుకు రావాలి

blood donation | రక్తదానం చేయడానికి ముందుకు రావాలి
- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
blood donation | నల్లగొండ, ఆంధ్ర ప్రభ : ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ రోజు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరం(blood donation camp)లో సేకరించిన రక్తం ఆపద సమయంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను, రక్తదాతలను కలెక్టర్ అభినందించారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు ఎస్సైలు సైదా బాబా, సైదులు, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి(Burri Srinivas Reddy), బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
