సర్టిఫికేట్లు అందజేసిన డీఎస్‌పీ

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ రో్జు మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి డీఎస్పీ రాజశేఖర్ రాజు సర్టిఫికెట్స్ అందజేశారు. నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడే పోలీసుల సేవలను సమాజం గుర్తించాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు నాగభూషణం, సోమనర్సయ్య, పీఎన్డీ ప్రసాద్, ఎస్సైలు సైదిరెడ్డి,లక్ష్మయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
