Blood donation camp | రక్తదానం ప్రాణాన్ని నిలబెడుతుంది

Blood donation camp | రక్తదానం ప్రాణాన్ని నిలబెడుతుంది

  • నల్లగొండ ఆర్డీవో

Blood donation camp | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : రక్తదానం నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని నల్లగొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి అన్నారు. ఇవాళ ట్రెసా నల్లగొండ డివిజన్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో అశోక్ రెడ్డి మాట్లాడుతూ… రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడానికి దోహదం చేస్తుందన్నారు.

ట్రెసా నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఆర్. కృష్ణమూర్తి మాట్లాడుతూ… రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడూ సేవలు అందించడమే కాకుండా ప్రాణాలను కాపాడానికి రక్తదానం చేయడం కూడా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నూకల వెంకన్న, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు యశ్వంత్, అక్తర్ అలీ, శంకర్, జానీ, తరుణ్, అజార్, లతీఫ్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply