BJP | మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ

BJP | మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ
BJP | న్యూఢిల్లీ- ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేసే సమయం ఆసన్నమైందని లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ కోటా అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించడానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఏకం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. విస్తృతమైన చర్చల తర్వాతే ఈ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తేవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏప్రిల్ 16-18 పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రు, ఎంపీలు ఈ మూడు రోజుల పాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, ఎటువంటి సెలవులు పెట్టవద్దు అని విప్ జారీ చేసింది. ఈ పార్లమెంట్ సెషన్ లో 2023 నారీ శక్తి వందన్ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన కు సంబంధించిన చట్టం తీసుకురానున్నారు.
