త్రిపుర గవర్నర్ ను కలిసిన బీజేపీ నాయకులు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన బిజెపి నాయకులు యాదగిరిగుట్టకు శనివారం వచ్చిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ శాలువాతో సన్మానించారు. జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, ఆలేరు పట్టణ బిజెపి అధ్యక్షులు నందగంగేష్, నియోజకవర్గ నాయకులు చిరిగే శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ పాశికంటి సంపత్, నాయకులు వినయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
