BJP | విజయం మనందరి గెలుపు

BJP | విజయం మనందరి గెలుపు

  • 19వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రేమ్ సింగ్

BJP | మంచిర్యాల, ఆంధ్రప్రభ : నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధికి నాంది పలికిందని భారతీయ జనతా పార్టీ దేశ సమైక్యతకు భద్రతకు సుపరిపాలన అందజేస్తుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆడే ప్రేమ్ సింగ్ అన్నారు. శుక్రవారం నామినేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని శనివారం 19వ డివిజన్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, కోపరేటివ్ సొసైటీ జాతీయ డైరెక్టర్ రాజు నాయక్, వినోద్,సుభాష్ నాయక్,చందు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్,జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ల గౌడ్, సారధ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో కైవసం చేసుకుంటామని తెలిపారు.

Leave a Reply