Birthday celebrations | జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Birthday celebrations | మోపిదేవి, ఆంధ్రప్రభ : సంక్షేమ సారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మోపిదేవి మండలం, మోపిదేవి ప్రధాన సెంటర్ నందు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

