bindover | ఉల్లంఘనలపై ఎక్సైజ్ చర్యలు

bindover | ఉల్లంఘనలపై ఎక్సైజ్ చర్యలు
- 29 కేసుల్లో రూ.9.31 లక్షల జరిమానా
bindover | ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : బైండోవర్‌ను ఉల్లంఘించి గుడుంబా తయారీకి పాల్పడిన వారిపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. మచ్చాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ విజయ్‌కు రూ.40,000, వాగ్ధరి గ్రామానికి చెందిన రాథోడ్ సలంతకు రూ.21,000 జరిమానా విధించి, ఈ రోజు చలాన్ రూపంలో మొత్తం రూ.61,000 వసూలు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు.
గత రెండు సంవత్సరాల్లో 29 బైండోవర్ ఉల్లంఘన కేసులలో నమోదు చేసి, 26 మంది నుంచి రూ.9,31,000 జరిమానా వసూలు చేయడంతో పాటు ముగ్గురిని జైలుకు పంపించినట్లు చెప్పారు. గుడుంబా లేదా బెల్లం అమ్మినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
