Bill Gates | ఇండియాకు బిల్‌గేట్స్… మూడేళ్లలో మూడోసారి రాక !

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత్‌కు మరోసారి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్‌ పరివర్తనలో భారత్‌ చాలా కీలకంగా వ్యవహరిస్తోందన్నారు.

కొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధింస్తుందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో ఆయన మూడో సారి భారత్‌ పర్యటనకు వస్తున్నారు. భారత్‌లో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో నిర్మూలన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.

2011లో భారత్‌లో చివరి పోలియో కేసు నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హెచ్‌ఐవీ నివారణకు చేపడుతున్న కార్యక్రమాన్ని ఆయన మెచ్చుకున్నారు. టీబీపై భారత్‌ పోరాటం చేస్తుందన్నారు.

టీకాల తయారీ, రోగ నిర్ధారణలో దేశ సామర్ధ్యాలను బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. భారత్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు ఆఫ్రికాలో ఈ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.

బ్యాంకింగ్‌, ప్రభుత్వ సేవలు, డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వాతావరణాన్ని అంచనా వేయడంలో, పంటలను ఎంచుకోవడడంలో, చీడపీడల బెడదను తగ్గించేందుకు ఏఐ సాయం చేస్తుందని చెప్పారు. ఈ టెక్నాలజీ ఆసియా అంతటా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

తాజా పర్యటనలో భారత్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలో చర్చలు జరపనున్నారు. బిల్‌గేట్స్‌కు చెందిన గేట్స్‌ ఫౌండేషన్‌ ఇండియాలోనూ కార్యక్రమాలు చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *